విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు రవికిషన్. అయితే ఇటీవల ఈ అందాల బోజ్ పురి విలన్ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. ఓ మహిళ తనని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించిందని బాంబు పేల్చారు రవికిషన్. ప్రస్తుతం ఆమెకు సమాజంలో పేరు, పలుకుబడి ఉందని అన్నారు.
తాజా ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ… ఈ వ్యాఖ్యలు చేశారు. అలానే సీనియర్ నటి నగ్మాతో ఉన్న రిలేషన్షిప్ గురించి కూడా మాట్లాడారు. “చిత్రసీమలోకి వచ్చిన సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. ఇబ్బందికర పరిస్థితులను చూశాను.
ఇకపోతే క్యాస్టింగ్ కౌచ్ సినీ పరిశ్రమలో సాధారణం. నేనూ అలాంటి వాటిని ఎదుర్కొన్నా. ఒకానొక స్టేజ్‌లో ఓ మహిళ నా దగ్గరకు వచ్చి ‘ఈ రాత్రి మనం కాఫీకి వెళ్దాం అని అడిగింది.
నాకెందుకో డౌట్ వచ్చి.. సున్నితంగా నో చెప్పాను. అయితే.. ఆమె ఎవరూ అనేది ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే ప్రస్తుతం ఆమెకు సమాజంలో ఎంతో పేరు ఉంది” అని రవికిషన్ పేర్కొన్నారు.
ఆ తర్వాత సీనియర్ నటి నగ్మాతో రవి కిషన్ రిలేషన్షిప్లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. వాటిపైనా ఆయన మాట్లాడారు. “నటీనటులు కలిసి వరుసగా కొన్ని చిత్రాల్లో నటిస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందని, అఫైర్ నడుస్తుందని వార్తలు వస్తుంటాయి.
నిజానికీ అవన్నీ రూమర్స్ మాత్రమే. మేము కలిసి నటించిన సినిమాలు సూపర్‌హిట్‌గా నిలవడంతో మళ్లీ మా కాంబో కొనసాగుతూ వచ్చింది. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.
మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అయినా మేమిద్దరం కలిసి చిత్రాలు చేసేటప్పటికే.. నాకు పెళ్లి అయిందని అందరికీ తెలుసు.” అని రవి కిషన్ చెప్పుకొచ్చారు.
కాగా, రవికిషన్.. నటుడు కావాలని చిన్నప్పటి నుంచి అనుకునేవారట. కానీ ఆయన తండ్రికి అది నచ్చలేదు. అమ్మ మాత్రం ప్రోత్సాహించేది. ఓ సారి ఆమె రవికిషన్‌కు రూ.500 ఇచ్చి ముంబయి వెళ్లేందుకు మద్దతుగా నిలిచింది.
అలా తన తల్లి ప్రోత్సాహంతో, తన కష్టంతో మంచి నటుడిగా ఎదిగారు. భోజ్‌పురిలో బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. అలా బాలీవుడ్‌తో పాట సౌత్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు రవికిషన్. అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’తో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.
ఇంకా తెలుగులో కిక్ 2, సుప్రీమ్, ఒక అమ్మాయి తప్ప, రాధ, లై, ఎమ్ఎల్ఏ, సాక్ష్యం, ఎన్టీఆర్ కథానాయకుడు, సైరా నరసింహారెడ్డి, గద్దలకొండ గణేశ్, హీరో వంటి చిత్రాల్లో నటించారు. గతేడాది ఖాఖీ: ది బీహార్ చాప్టర్ వెబ్ సిరీస్‌లోనూ నటించారు.