రత్నకిశోర్ శంభుమహంతి, రచయిత
మిస్టర్ రవి.. యూ ఆర్ ఎ రైజింగ్ ఒన్
ఏయూ చెట్లూ వాటి నీడలు
విశాఖ తీరాలు వాటి పరిపక్వ దశలూ
అన్నింటా అన్నింటా వినిపించు మాటలూ మౌనాలూ
కలిస్తే రవి ప్రకాశ్. ఓ బీజేఎంసీ విద్యార్థిగా కొద్ది మందికి మాత్రమే తెలిసిన రవి ప్రకాశ్. బక్క పలచని దేహంతో తన పనేదో తాను అనుకునే రవి ప్రకాశ్.. మీడియాకో దారి చూపాడు. సెన్సేషన్ అయ్యాడు. వార్తలకో గ్లామర్ ఇచ్చాడు. టెలివిజన్ మాధ్యమ గతిని మార్చాడు. ఒక్కడుగా వాడు.. ఒంటరిగా వాడు. కెమెరా భుజాన మోసిన రోజున, ఉద్యమ కాలాల నడుమ నడిచిన, ఏయూ టు ఓయూ ఓవర్ టు రవి.. నీవిక మాట్లాడు.. నీవిక కొత్త ప్రభంజనం సృష్టించు.. నీ అనుకునే వారి గొంతుక మళ్లీ మళ్లీ వినిపించు..
ఆల్ ద బెస్ట్.
టీవీ నైన్ .. రాక మునుపు
టీవీ వైపు చూసే వార్త
టీవీ కన్ను ప్రసారం చేసే వార్త
వేర్వేరు.. అవును అప్పటిదాకా వార్త వేరు
అప్పటి నుంచి వార్త వేరు.
రాజకీయం సామాజికం సాంస్కృతికం సినిమా
వీటి ప్రాధాన్యాలు మారిపోయాయి.న్యూస్ రూమ్ డెఫినిషన్ మారిపోయింది
ఒక బేస్ వాయిస్ మాట్లాడుతూ మాట్లాడుతూ.. జనం వైపు తనని తన వైపు మాధ్యమాలను తిప్పుకునేలా చేయగలిగింది.. ఆ ఒక్క గొంతుక ప్రభావం.. లేదా సంబంధిత ప్రాభవం దగ్గర టీవీ మాధ్యమం విస్తుబోయింది.కొత్త రకం జర్నలిజం చూసింది. కొత్త గొంతుకల ఆవశ్యకతను గుర్తించింది. తనను తాను మార్చుకుంది. వార్త రూపూ రేఖ సంబంధిత ప్రమాణం అన్నీ అన్నీ ఆ గతితో మారి, తమని తామే కొత్తగా నిర్వచించుకున్న తరుణం రానే వచ్చింది. ఏయూ టు ఓయూ ఓవర్ టు యూ రవి.
అరుణ్ సాగర్ ఒక వైపు
అంతకుమునుపో ఆ తరువాతో
కేఎన్‌వై పతంజలి ఒకవైపు
నిండు చందురుడు ఒకవైపు
తానొక్కడే ఒకవైపు అన్న చందంగా
అంతా అంతా ఆ తారలు కలబోసుకుని చందురుడి చుట్టూ చేరారు. మాధ్యమాలకో కొత్త స్టార్ డమ్ తీసుకువచ్చేరు.పతంజలి లాంటి ఉద్దండులతో మొదలిడి.. అనేకానేక మలుపులు తిరుగుతూ అక్కడి వార్తా రచన కొత్తందాలు పోగేసుకుంది.కొత్త సాహసాలకు కేరాఫ్ అయింది.ముప్పై నిమిషాల బులెటెన్ సంచలనాలకు కేరాఫ్‌గా మారింది. అనేక అనామక జర్నలిస్టులకు టీవీ9 లేబుల్ అండ్ లోగో కొత్త జీవితాలను ఇచ్చి కుటుంబాలను చక్కదిద్దింది. ఆ క్రమంలో కొన్ని ఒడిదొడుకులు దాటి.. బుల్లితెరపై ప్రతి బులెటెన్ కొత్తకు చిరునామాగా మారింది. వీధి వీధినా టీవీ9 కో క్రేజ్.. కొంత తడబాటు ఉన్నా వార్త ఏదయినా రావాల్సినంత ఎటెన్షన్ కావాల్సినంత ఇంటెన్షన్‌తో ఓ మార్పునకు అడ్డాగా మారిపోయింది. మళ్లీ కెమెరా కన్ను మాట్లాడుతోంది. మళ్లీ స్టూడియో వెలుగులు మాట్లాడుతున్నాయి. రవి ప్రకాశ్ అను ఒక ప్రయత్నం మరో దిశగా అడుగు వేస్తోందని.. ఆ అడుగు విజయవంతం కావాలని కోరుతోంది. ఇప్పుడిక రాజకీయ ఆర్థిక సామాజిక సినిమా రంగాన రవి ప్రకాశ్ విశ్లేషణ, వివరణ ఏంటన్నది ఆసక్తిదాయకం.
మిస్టర్ ఆర్ హ్యాపీ బర్త్ డే
మిస్టర్ మీడియా హ్యాపీ బర్త్ డే
ఎనదర్ మీడియా మొగల్ హ్యాపీ బర్త్ డే
ఆర్ అండ్ ఆర్
రవి అండ్ రివల్యూషన్
ఆర్ అండ్ ఆర్
రీసెర్చ్ అండ్ రిఫరెన్స్
ఆర్ అండ్ ఆర్
వండర్స్ అండ్ వైబ్రేషన్స్
నౌ బి కమింగ్ న్యూ..
ఏయూ టు ఓయూ.. ఓవర్ టు యూ రవి!
ఆల్ ద బెస్ట్.
we wish you a happy birthday.