బోనస్ ఇప్పుడు కాదు, పదేళ్లుగా ఇస్తూనే వున్నా..
నన్ను ప్రశ్నిస్తున్న మీడియాకు ఓ సూచన.
బయటికి వెళ్లి వీళ్లు చేస్తున్న భూకబ్జాలు, కాంట్రాక్టులు ఎలా జరుగుతున్నాయో చూడండి..
వాళ్లని ఒకసారి ప్రశ్నించండి, మీకే తెలుస్తుంది.
ప్రజలకు ఏదీ కావాలో ఒకసారి చూడండి.
హైదరాబాద్ : ములాఖత్‌లో కలిసిన మహిళా జర్నలిస్టు, మోజో సీఈవో రేవతి ద్వారా మీడియా దిగ్గజం రవిప్రకాశ్ ఒక సందేశాన్ని పంపించారు. ‘బోనస్ ఏదైతే అక్రమమని చెబుతున్నారో అది గత పదేళ్లుగా దేశవ్యాప్తంగా వున్న టీవీనైన్ ఉద్యోగులందరికీ చైర్మన్ హోదాలో ఇస్తున్నదే. ఇందులో అక్రమం ఏదీ లేదు. ఇవాళ దేశాన్ని, రెండు తెలుగు రాష్ట్రాల్ని మెఘా కృష్ణారెడ్డి, మైహోమ్ రామేశ్వరరావు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు. వారు చేస్తున్న దోపిడీని ప్రశ్నిస్తూనే వుంటాను. జైల్లోకి పంపించినా నేనేమీ భయపడటం లేదు. నేను ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాను. ఐయామ్ రెడీ ఫర్ ద బాటిల్. బయటికొచ్చి వారి బాగోతాల్ని ఇంకా బాగా అందరికీ అర్ధమయ్యేలా చెబుతాను. సంస్థలో 12 కోట్లు దోచుకున్నానని ఇవాళ కొంతమంది జర్నలిస్టులు, మీడియా వాళ్లు ప్రచారం చేస్తున్నారో మీరు బయటికి వెళ్లి వీళ్లు చేస్తున్న భూకబ్జాలు, కాంట్రాక్టులు ఎలా జరుగుతున్నాయో ఒకసారి ప్రశ్నించండి, మీకే తెలుస్తుంది. ప్రజలకు ఏదీ కావాలో ఒకసారి చూడండి. గత పదేళ్లుగా జరుగుతున్న దాంట్లో అక్రమంగా జరిగిందని చెప్పి వాళ్లు కేసు పెడితే నెక్స్ట్ డే నన్ను అరెస్టు చేశారు. ఇవాళ ఇన్ని అక్రమాలు జరుగుతుంటే మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదు.? ప్రశ్నించకుండా చేస్తున్నారు. నేనైతే ఆగను ప్రశ్నిస్తూనే వుంటాను..’