ఇంగ్లాండ్ పర్యటనలో కరోనా బారిన పడ్డ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇండియా చేరుకున్నారు. కరోనా నుండి కోలుకున్న ఆయన నేరుగా ఇండియాకు వచ్చారు. ఐదో టెస్టు అర్ధాంతరంగా రద్దు కావటం, బీసీసీఐ రూల్స్ కు విరుద్దంగా వెళ్లి కరోనా బారిన పడ్డారన్న అంశాలపై రవిశాస్త్రి స్పందించారు.
తాను కరోనా బారిన పడ్డప్పటికీ తనకు ఎలాంటి లక్షణాలు లేవన్నారు. పది రోజుల పాటు కేవలం ఒక్క గొంతు నొప్పి మాత్రమే బాధపెట్టిందని, జ్వరం కానీ ఆక్సిజన్ లెవల్స్ పడిపోవటం వంటివి లేవన్నారు. తనకు ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తైనందున తను పారాసిటమాల్ కూడా వేసుకోవాల్సిన అవసరం రాలేదన్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. వ్యాక్సిన్ వేసుకున్నాక కరోనా సోకినా మాములు జలుబుగా మాత్రమే ఉంటుందనేందుకు ఉదాహరణ అని తెలిపారు.
ఇక టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20ల కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై చెప్పబోతుండగా… కోచ్ బాధ్యతల నుండి రవిశాస్త్రి కూడా తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ లు అన్ని ఫార్మాటల్లో కోచ్ లుగా రాబోతున్నట్లు తెలుస్తోంది.