వరుస అపజయాలతో రవితేజ రెమ్యూనరేషన్ దారుణంగా పడిపోయింది. ఓదశలో రవితేజ సినిమాలు కనీసం 10కోట్ల బిజినెస్ కూడా చేయలేక చతికిలపడిపోయాయి. దీంతో రవితేజ తన క్రాక్ సినిమా విడుదల వరకు కొత్త సినిమాలకు ఒప్పుకోలేదు. తన 10కోట్లకు పైగా రెమ్యూనరేషన్ కోట్ చేయగా నిర్మాణ సంస్థలేవీ ముందుకు రాలేదు.
కానీ ఒక్క క్రాక్ మూవీ విజయంతో రవితేజ మళ్లీ రేటు పెంచేశాడు. ఇప్పుడు ఏకంగా ఒక్కో సినిమాకు 16కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రొడ్యూసర్స్ వెనుకాముందవుతున్నట్లు చర్చ సాగుతుంది. ఇక రవితేజతో సినిమాకు డైరెక్టర్లు అనిల్ రావిపూడి, త్రినాథరావు నక్కిన, వక్కంతం వంశీలు కథను సిద్ధం చేస్తున్నారు.
రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నాడు.