నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ లో స్పీడ్ గా ముందుకు వెళ్తున్నారు. అఖండ సినిమా ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత ఆహా సినిమాలో చేసిన షో కూడా ఆయన రేంజ్ ని పెంచింది అని అంటున్నారు ఫాన్స్. ప్రస్తుతం బాలకృష్ణ… అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత వీవీ వినాయక్ తో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంచితే బాలకృష్ణ ఒక మంచి కథ ను దూరం చేసుకున్నారు అన్నారు నిర్మాత సి కళ్యాణ్. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను ప్లాన్ చేసారట ఆయన. అదే క్రాక్ సినిమా. బాలకృష్ణ తో ఆ సినిమా చేసేందుకు ఆయన ఆసక్తి చూపించినా సరే బాలయ్య నో అన్నారట. ఆ తర్వాత అదే కథ తో రవితేజా సినిమా చేసి మంచి హిట్ కొట్టారు. గోపిచంద్ మలినేనితో ఒక సినిమా బాలయ్య హీరోగా చేస్తా అని అంటున్నారు.
క్రాక్ సినిమా మంచి వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గోపిచంద్ మలినేని… గోపిచంద్ కోసం ఒక మాస్ కథను సిద్దం చేసారని తర్వాత సాయి ధరం తేజ్ తో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న అనీల్ రావిపూడి సినిమా కొత్త కాన్సెప్ట్ తో వస్తుందని సమాచారం.