రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కాస్త ఇబ్బంది పడుతున్న వాతావరణం కనపడుతుంది. ఆయన భారీ బడ్జెట్ సినిమాలు చేయడం అవి ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడం వంటివి జరుగుతున్నాయి. అగ్ర హీరోగా ఒక వెలుగు వెలిగిన చిరంజీవి రీమేక్ సినిమాల మీద కూడా ఆశలు పెట్టుకుని రెండు చేసినా అవి కూడా ఆయనకు మంచి ఫలితాన్ని ఇవ్వలేదనే అభిప్రాయం ఉంది.
ఇప్పుడు యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేసారు. వాల్తేరు వీరయ్య అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమాకు భారీ ప్రచారం చేస్తుంది చిత్ర యూనిట్. గాడ్ ఫాథర్ సినిమా ఫలితం నుంచి వేగంగానే బయటకు వచ్చిన చిరంజీవి… వాల్తేరు వీరయ్య మీద ఫోకస్ చేసారు. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజను కూడా తీసుకోవడం విశేషం. ఆయన పాత్ర సినిమాకు కీలకం అంటున్నారు.
ప్రమోషన్ కార్యక్రమాల్లో రవితేజ కూడా భారీగానే పాల్గొంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అనే దానిపై పెద్ద చర్చే జరుగుతుంది. ఏసీపీ విక్రం సాగర్ అనే పాత్రలో నటించిన రవితేజా పాత్ర దాదాపుగా 50 నిమిషాలు ఉంటుంది. అందుకు గాను ఆయన 17 కోట్ల వరకు అందుకున్నారు అని టాక్. రవితేజాకు ఉన్న ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని చిత్ర యూనిట్ కూడా ఆ రేంజ్ లో ఇవ్వడానికి సిద్దమైంది.