టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ రోజుకో ప్రెస్ మీట్ తో గులాబీ లీడర్లను ఆడుకుంటున్నారు. ఆదివారం కేటీఆర్ పై విరుచుకుపడ్డ ఆయన.. తాజాగా ఎర్రబెల్లిని ఏకి పారేశారు. ఓటర్లను బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న సర్దార్.. టీఆర్ఎస్ ను ఓడిస్తానని చెబుతున్నారు.
క్యాంపు రాజకీయాలు చేయడమే కాకుండా మీరు వేసే ఓటు తమకు తెలిసేలా కెమెరాలు పెడతామని స్థానిక ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్నారని ఆరోపించారు రవీందర్ సింగ్. దమ్ముంటే కెమెరాలు పెట్టు చూద్దాం అని ఎర్రబెల్లికి సవాల్ విసిరారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను బెదిరించి ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా గులాబీ పార్టీ గెలవదని ధీమా వ్యక్తం చేశారు.