రావినూతల శశిధర్, వీహెచ్పీ రాష్ట్ర సహ కార్యదర్శి
అయ్యప్ప స్వామి పుట్టుకపై అసభ్యకరమైన భాషను ఉపయోగించారు. కోటాను కోట్ల అయ్యప్ప స్వామి భక్తుల మనోభావాలు గాయపరిచారు. అయ్యప్ప, విష్ణుమూర్తి మరియు పరమ శివునిపై అసభ్యకరమైన భాషను ఉపయోగించిన బైరి నరేష్ పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలి.
వెంటనే అతడ్ని అరెస్టు చేయాలి. నేర చరిత్ర కలిగిన బైరి నరేష్ పైన మరియు సభా నిర్వాహకులపైన చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలి. పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోతే లక్షలాది మంది అయ్యప్ప స్వాములతో కలిసి ప్రగతి భవన్ దిగ్భందం చేస్తాం. ఇది వీహెచ్పీ హెచ్చరిక.
బైరి నరేష్ వ్యాఖ్యలపై అయ్యప్ప స్వామి భక్తులు మరియు యావత్ హిందూ సమాజం ఆగ్రహంతో ఉంది. ఈ విషయాన్ని విస్మరించి తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు హిందువుల విశ్వాసాలను విస్మరిస్తే మంచిగా ఉండదు. సరైన చర్యలు తీసుకోకపోతే తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది.