యాభై కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కేవలం పద్దెనిమిది నెలల వ్యవధిలో కూచిపూడిలో నిర్మించిన ‘రవిప్రకాశ్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి’ ఇప్పుడు వైద్య రంగంలో ప్రయోగాలకు వేదికగా నిలుస్తోంది.
ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అభిలాష్ ప్రమాదంలో తెగిపడిన చూపుడు వేలుని తిరిగి అతికించి అరుదైన ఘనత సాధించారు. క్షతగాత్రుడి వేలు పూర్తిగా తెగిపోవడం.. దాన్ని డాక్టర్ అభిలాష్ సర్జరీ ద్వారా తిరిగి వేలికి చేర్చి అతికించడం కింది ఫోటోల్లో గమనించవచ్చు.
వైద్య చరిత్రలో ఇది అరుదైన సర్జరీగా చెబుతున్నారు. టీవీనైన్ వ్యవస్థాపకుడు రవిప్రకాశ్ అందిస్తున్న ప్రోత్సాహం వల్లే కృష్ణాజిల్లాలో మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేసిన సంజీవనీ ఆసుపత్రి ఇవాళ వేలాదిమంది దివి వాసులకు వెలుగురేఖగా నిలిచిందని డాక్టర్ అభిలాష్ చెప్పారు.
సముద్రానికి దగ్గరగా.. ప్రపంచానికి దూరంగా వుండే ఈ ప్రాంతంలో ప్రభుత్వపరంగా సరైన వైద్య సదుపాయాలు లేవు. టీవీనైన్ వ్యవస్థాపకుడు రవిప్రకాశ్ చొరవతో కూచిపూడిలో ఏర్పాటైన సంజీవని ఆసుపత్రి ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దివి సీమ ప్రజానీకానికి ఉపయోగపడేలా భారీ కార్పొరేట్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.