నీ దేహపు దుర్గం నేనై
నా బాహువు ఖడ్గం నీవై
సమరంగా సముజ్వలిస్తే
ప్రళయంగా పరిప్లవిస్తే.. అని శ్రీశ్రీ అన్నట్టు అతనే ఒక ఖడ్గం.
జర్నలిజమే జీవితం. జీవితమంతా సమరం.
ఎన్ని కష్టాలు రాని, ఎన్ని వత్తిళ్లు ఎదురవ్వని..
చెదరని చిరునవ్వు ఆ ముఖాన్ని వీడిపోదు..
ఆ వీక్షణం తీక్షణం.. నిరంతరం ఏదో శోధిస్తుంటుంది..
ఆ గుండెకు లోతెక్కువ.. తప్పు ఎక్కడ జరిగినా తట్టి లేపుతుంది.
ఆ కళ్లకు తడి ఎక్కువ.. బాధా సర్పద్రష్టుల ఆర్తనలు విని చెమ్మగిల్లుతాయి.
తలవొంచడు…తను ఒగ్గడు…
విధినణిచే విస్పోటం..
అతడు రవిప్రకాశ్. మీడియా విప్లవం.
ఒక కెరటంలా వచ్చాడు. ఎగిసిపడ్డాడు నిజమే..
మళ్లీ మళ్లీ వస్తాడు. ఎగిసిపడుతూనే వుంటాడు.
కెరటాలు ఆపాలనుకోవడం ఎవరి తరం కాదు..