సమ్మర్ రేసులో మరో టాలీవుడ్ ఫిల్మ్ దూసుకొచ్చింది. ఇప్పటికే పలు సినిమాలు తమ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ వస్తుండగా… క్రాక్ మూవీతో సంక్రాంతికి హిట్ కొట్టిన మాస్ మహారాజ్ రవితేజ కూడా సమ్మర్ కు మరో మూవీతో రెడీ అయిపోయాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఖిలాడీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
ప్రస్తుతం వైజాగ్ లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమాను మే 28న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. డబుల్ యాక్షన్ లో, హైఓల్టేజ్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కిస్తున్నారు.
దేవీశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా, కోనేరు సత్యనారాయణతో కలిపి పెన్ స్టూడియోస్ సినిమాను తెరకెక్కిస్తోంది.