ఈరోజు రవితేజ పుట్టినరోజు. దీంతో ఈ రోజు అంతా మాస్ రాజా అప్ డేట్స్ తో నిండిపోనుంది. ఓవైపు శుభాకాంక్షలు, మరోవైపు అతడి సినిమా అప్ డేట్స్ తో సోషల్ మీడియా షేక్ అవ్వబోతోంది. ప్రస్తుతం రవితేజ 3 సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఇంకోటి స్టార్ట్ చేశాడు. వీటిలో 3 సినిమాల అప్ డేట్స్ లాక్ అయ్యాయి. నాలుగో సినిమా నుంచి సర్ ప్రైజ్ సిద్ధంగా ఉన్నట్టు టాక్.
రవితేజ నటిస్తున్న సినిమా ఖిలాడీ. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ దాదాపు రెడీ అయింది. ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ మాస్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఫుల్ కిక్ అనే లిరిక్స్ తో సాగే ఈ పాట.. మాస్ రాజా ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే హ్యాష్ ట్యాగ్ తెగ వైరల్ అవుతోంది.
ఇక రవితేజ నటిస్తున్న మరో సినిమా రామారావు ఆన్ డ్యూటీ. బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ ను ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. టీజర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక రవితేజ నటిస్తున్న మరో సినిమా ధమాకా. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి కూడా ఈరోజు సాయంత్రం ఓ అప్ డేట్ రాబోతోంది.
ఈ 3 సినిమాలతో పాటు తాజాగా రవితేజ లాంఛ్ చేసిన మరో సినిమా రావణాసుర. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంఛ్ అయిన సినిమా ఇది. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే రవితేజ లుక్, గెటప్ బయటకొచ్చాయి. ఈరోజు మరో పోస్టర్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాల అప్ డేట్స్ తో పాటు, విడుదల తేదీలపై కూడా ఈరోజు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.