వరుస ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న మాస్ మహారాజ్ కొత్త మూవీ క్రాక్. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీని గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ మూవీని సంక్రాంతి బరిలో దించబోతున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. జనవరి 14న మూవీ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. థమన్ సంగీతం అందించగా, ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీకి పోటీగా ఈసారి సంక్రాంతికి రామ్ రెడ్ మూవీతో పాటు, విజయ్ మాస్టర్ సినిమా కూడా రిలీజ్ కానుంది.