మాస్ రాజా రవితేజ తన ప్రాజెక్ట్‌లను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. తాజాగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధమాకా మరో షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇదే విషయాన్ని చెబుతూ మేకర్స్ ఓ పోస్ట్ పెట్టారు.
మాస్ మహారాజా రవితేజ ధమాకా 4వ షెడ్యూల్ కంప్లీట్ అయింది అంటూ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజాదవా కథ, మాటలు అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు.
ధమాకా… డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇటీవలే రవితేజ పై యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు.
Another Schedule Wrap 🥳🤘
Mass Maharaja @RaviTeja_offl😎#Dhamaka ⚡️Wrapped up the 4th Schedule on a High Note🔥
Gearing up for DHAMAKEDAR ENTERTAINMENT💥in Cinemas 🔜@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @peoplemediafcy @AAArtsOfficial @vivekkuchibotla @dhamakaoffcl pic.twitter.com/6ZIK7WLsZL
— People Media Factory (@peoplemediafcy) March 2, 2022
Advertisements