విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ జంటగా నటిస్తోన్న ఎఫ్ 3. హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఈసారి మరింత వినోదాన్ని అందిస్తానని డైరెక్టర్ హామీ ఇచ్చాడు. తాజా అప్డేట్ ప్రకారం మాస్ మహారాజ్ రవితేజ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
వెంకీ 60వ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ‘ఎఫ్3’ కాన్సెప్ట్ పోస్టర్ సినీ ప్రేమికుల్లో ఆసక్తి రేపుతోంది. డబ్బులతో నిండిన ట్రాలీని నెట్టుకెళ్తోన్న వెంకీ, వరుణ్ లుక్‌లు భిన్నంగా ఉన్నాయి. అయితే ఈ ఇద్దరు హీరోలను ఇరకాటంలో పెట్టే పాత్ర రవితేజ పోషించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వెంకీ ‘నారప్ప’ సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా, వరుణ్ తేజ్ బాక్సర్ గా రాబోతున్నాడు. ఈ సినిమాలు పూర్తయ్యాక ఇద్దరు నటులు ‘ఎఫ్ 3’ షూటింగ్లో పాల్గొననున్నారు.