ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. ఊహాగానాలే నిజమయ్యాయి. చిరంజీవి సినిమాలోకి రవితేజ వచ్చి చేరాడు. ఇవాళ్టి నుంచి కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ విషయాన్ని యూనిట్ కూడా అధికారికంగా ప్రకటించింది. రవితేజపై చిన్న వీడియోను కూడా విడుదల చేసింది.
బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ మూవీకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ అనుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈ కీలకమైన పోలీసాఫీసర్ పాత్ర ఉంది. ఈ పాత్ర కోసం రవితేజను అనుకున్నారు. ఈ మ్యాటర్ చాన్నాళ్ల కిందటే బయటకొచ్చింది. కాకపోతే, రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ బెట్టుచేశాడు. తన హీరోగా నటిస్తే ఓ సినిమాకు ఎంత తీసుకుంటాడో, దాదాపు అంతే ఎమౌంట్ అడిగినట్టు సమాచారం. మధ్యేమార్గంగా ఓ మంచి రేటు సెట్ చేసినట్టు తెలుస్తోంది. అలా రేటు తెగడంతో, రవితేజ సెట్స్ పైకి వచ్చేశాడు.
ఇవాళ్టి నుంచి 2 నెలల పాటు చిరంజీవి సినిమా కోసం రవితేజ వర్క్ చేస్తాడు. దీన్ని బట్టి సినిమాలో అతడి పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో, నిడివి ఎంత ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.
Advertisements
శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి ఎట్రాక్షన్ గా సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.