రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ఖిలాడి. ఫిబ్రవరి 11న భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే అర్జున్, అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
మొదట ఫిబ్రవరి 11న తెలుగులోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన మేకర్స్ ఇప్పుడు హిందీలో కూడా అదే డేట్ కి రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
మరి చూడాలి ఖిలాడి సినిమాకు హిందీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో. ఇక దీంతోపాటు రవితేజ మరో నాలుగు చిత్రాలలో నటిస్తున్నాడు అందులో టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతుంది.