మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడి. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గతంలో రాక్షసుడు సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు రమేష్ వర్మ. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాలో ఇష్టం అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ మణి లిరిక్స్ రాయగా, హారి ప్రియ పాటను పాడారు. ఈ పాటను వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు.