లాంగ్ గ్యాప్ తర్వాత మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో హిట్ ని అందుకున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్, సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతానికి రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందట.
ఈ మేరకు నిర్మాత ప్రకటించారు. అంతే కాదు తమ సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేసి ప్రేక్షకులను థ్రిల్ ఇస్తామని కూడా రమేష్ వర్మ తెలిపారు. అలాగే ఈ సినిమాకు శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ డైలాగ్స్ అందిస్తుండటం విశేషం.