రాజా ది గ్రేట్ తర్వాత మరో హిట్ లేని మాస్ మహారాజ రవితేజ.. ఇటీవల క్రాక్ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ప్రొడ్యూసర్లు మళ్లీ ఆయన కాల్షిట్ల కోసం క్యూకట్టారు. ఫలితంగా వరుస సినిమాలతో బిజీగా మారాడు రవితేజ. ఈక్రమంలోనే ఆయన నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్‌గా ఖిలాడి రాబోతోంది. ఈ మూవీ నుంచి ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది.
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్న ఖిలాడి గురించి ఇప్పటిదాకా పెద్దగా అప్‌డేట్లు లేవు. తాజాగా ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా నుంచి ఓ సర్‌ప్రైజ్ రాబోతోంది. ఖిలాడి టీజర్‌ను ఈనెల 12న ఉదయం 10గం.08 నిముషాలకి రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు.
హావీష్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ అలాగే యాంకర్ అనసూయ కీలక పాత్రలలో కనిపించనున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కోసం ఇటలీకి వెళ్లిన ఖిలాడి టీం.. కరోనా కారణగా హోటల్ రూమ్‌కే పరిమితమైనట్టుగా ప్రచారం జరిగింది. షూటింగ్ ఆలస్యం అయ్యే చాన్స్ ఉండటతో.. రిలీజ్ డేట్ విషయంలో ప్రొడ్యూసర్లు కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారని చెప్పుకుంటున్నారు.