ఎప్పటినుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ క్రాక్ సినిమాతో హిట్ కొట్టాడు. అయితే మరోవైపు రమేష్ వర్మ దర్శకత్వంలో కిలాడి సినిమా చేస్తున్నాడు రవితేజ. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ రీసెంట్ గానే హైదరాబాద్ లో ప్రారంభమైంది.
కాగా జనవరి 26న రవితేజ పుట్టినరోజు నాడు కిలాడి టీజర్ ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు.