ఖిలాడీ సినిమా రిలీజ్ ఎప్పుడు? కొంతమంది ఫిబ్రవరి 11 అంటున్నారు. మరికొంతమంది ఫిబ్రవరి 18 అంటున్నారు. ఎందుకీ డౌట్స్ వస్తున్నాయి. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ అయింది. దీనికి కారణం ఈ సినిమా డబ్బింగ్ ఇంకా పూర్తికాకపోవడమే. హీరో రవితేజ, ఖిలాడీ సినిమా డబ్బింగ్ ఇంకా పూర్తిచేయలేదని సమాచారం.
సాధారణంగా హీరోలంతా డబ్బింగ్ ను చివరి వరకు పెండింగ్ లో ఉంచుతారు. దీనికి కారణం రెమ్యూనరేషన్. షూటింగ్ పూర్తయి, డబ్బింగ్ కు వెళ్లేలోపు ఫుల్ పేమెంట్ మొత్తం చేతికి అందితేనే హీరోలు డబ్బింగ్ చెబుతారు. లేకపోతే డబ్బింగ్ థియేటర్ లోకి అడుగు కూడా పెట్టరు. ఖిలాడీ కోసం రవితేజ కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాడని చాలామంది అనుకుంటున్నారు.
కానీ ఇందులో నిజం లేదు. ఖిలాడీ సినిమాతో తన కెరీర్ లోనే అత్యథిక పారితోషికం తీసుకుంటున్నాడు రవితేజ. అంతేకాదు.. ఆ పారితోషికాన్ని కూడా 2 విడతల్లో ఎప్పుడో అందించాడు నిర్మాత కోనేరు సత్యనారాయణ. ఇంకా చెప్పాలంటే 60శాతం రెమ్యూనరేషన్ ను షూటింగ్ కు ముందే అందుకున్నాడట రవితేజ.
సో.. రెమ్యూనరేషన్ ఇష్యూ కాదనే విషయం తేలిపోయింది. ఎటొచ్చి అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయడం రవితేజకు ఇష్టం లేదంట. థియేట్రికల్ వ్యవస్థ పూర్తిస్థాయిలో గాడిన పడకుండా ఖిలాడీ సినిమాను విడుదల చేస్తే, అది తన ట్రాక్ రికార్డ్ కు ఇబ్బందిగా మారుతుందని ఫీల్ అవుతున్నాడట మాస్ రాజా. అందుకే డబ్బింగ్ చెప్పకుండా డిలే చేస్తున్నాడని టాక్.