చాలా కాలం తర్వాత హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు మహారాజా రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రాక్ చిత్రం రవితేజకు మంచి హిట్ ను ఇచ్చింది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన డాన్ సీను, బలుపు వంటి చిత్రాలు హిట్ కావడంతో ఆటోమేటిక్ గా ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. అయితే ఇక్కడ కూడా అదే హిట్ ఫార్ములా కంటిన్యూ చేశారు.శృతిహాసన్ గ్లామర్ ,తమన్ మ్యూజిక్, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ అన్నీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందట. అదికూడా జనవరిలోనే అని సమాచారం. కానీ ఫ్యాన్స్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదట. క్రాక్ సినిమా థియేటర్ లో చూడాల్సిందే గాని ఓటీటీటీలో కాదంటూ మండిపడుతున్నారు.