మాస్ మహారాజ్ రవితేజ హిట్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా ఖిలాడీ పోస్టర్ తో అభిమానులను ఆనందపర్చగా… సంక్రాంతి రేసులో ఉన్న క్రాక్ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది.
ట్రైలర్ రవితేజ స్టైల్లో ఆకట్టుకునే విధంగా ఉంది. వెంకీ వాయిస్ ఓవర్ అందించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీలో రవితేజ సరసన శృతిహాసన్ నటిస్తుండగా, తమన్ సంగీతం అందించారు.