ఇటీవల కాలంలో సరైన హిట్ లేక సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ. రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే న్యూ ఇయర్ కానుకగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.
అయితే ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ రిలీజ్ అయ్యి 24 గంటలు పూర్తి కాకముందే మంచి వ్యూస్ దక్కించుకుంది. 20 గంటలలో 6.2 మిలియన్ వ్యూస్ సాదించటమే కాకుండా యూట్యూబ్ లో నెంబర్ వన్ గా ట్రెండ్ అవుతుంది. రవితేజ సినీ కెరీర్ లోనే మంచి వ్యూయర్ షిప్ అందుకున్న ట్రైలర్ గా క్రాక్ ట్రైలర్ నిలిచింది.