మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల సక్సెస్ కొట్టలేకపోయినా… తన డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. సినిమా సక్సెస్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూనే వెళ్తున్నారు. ఇక ప్రతిరోజు పండగే తో సక్సెస్ కొట్టిన సెన్సిబుల్ డైరెక్టర్ మారుతీ రవితేజతో సినిమాకు కథ రెడీ చేశారు. కథ రవితేజకు నచ్చటంతో ఒకే చెప్పారు. ఈ మూవీకి యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థగా ఉంది.
ఈ సినిమాకు రవితేజ 12కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయగా… యూవీ క్రియేషన్స్ 9 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రవితేజను ఒప్పించేందుకు డైరెక్టర్ మారుతీతో పాటు నిర్మాణ సంస్థ ప్రయత్నించినా రవితేజ ఒప్పుకోలేనట్లు సమాచారం. దీంతో ఈ సినిమా ఇక పట్టాలెక్కటం లేదని తెలుస్తోంది.
ఇటు డైరెక్టర్ మారుతీ సైతం ఇదే కథతో హీరో గోపిచంద్ ను కలిసినట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేసేందుకు గోపిచంద్ ఇప్పటికే అంగీకరించి ఉండటంతో… ఈ మూవీ పట్టాలెక్కే అవకాశాలు కనపడుతున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.