మాస్ మహారాజా రవితేజ ధమాకా చిత్రం ద్వారా టాలీవుడ్ తన మాస్ పవర్ చూపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో నటించిన వాల్తేరు వీరయ్య రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ నెలలో రావణాసుర సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్న రవితేజ, టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్ ని కూడా చాలా స్పీడ్ గా చేస్తున్నాడు.
పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ లేటేస్ట్ షెడ్యూల్ గురించి ప్రొడ్యూసర్స్ అప్డేట్ ఇచ్చారు. “A night schedule of #Tiger nageswara rao happening at a very large and lavish scale. this sequence will be specila in the movie first look sonn!” అంటూ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ ట్వీట్ చేశాడు.
స్టువర్టుపురం దొంగల ముఠాలో నాగేశ్వరరావు ఒకరు. అతని తెగింపునకు గుర్తుగా టైగర్ పేరుతో పిలిచేవారు. 1970 దశకంలో అధికారులకు నాగేశ్వరరావు ముచ్చెమటలు పట్టించాడు. చిక్కినట్టే చిక్కి తప్పించుకునేవాడు. ఒకానొక సమయంలో మద్రాస్ జైలు నుంచి కూడా తప్పించుకున్నాడు. 1987లో పోలీసులు అతనిని మట్టుబెట్టారు.
A night schedule of #TigerNageswaraRao happening at a very large and lavish scale 🔥🔥
First look soon!@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher @NupurSanon @gaya3bh @gvprakash @madhie1 @MayankOfficl @AAArtsOfficial pic.twitter.com/Wcz5RMUYWx
— Abhishek Agarwal 🇮🇳 (@AbhishekOfficl) February 6, 2023
నిజానికి నాగేశ్వరరావు గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. తెలియనది చాలా ఉంది అనేదే ఈ సినిమా. వంశీకృష్ణ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. రేణు దేశాయ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా రవితేజని పాన్ ఇండియా హీరోగా నిలబెడుతుందో లేదో చూడాలి.