చిరంజీవి సినిమా నుంచి ప్రీ-లుక్ వచ్చేసింది. అదేంటి.. చిరంజీవి ఫస్ట్ లుక్ ఆల్రెడీ వచ్చేసింది కదా.. ఇప్పుడు కొత్తగా ప్రీ లుక్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఇది రవితేజకు సంబంధించిన ప్రీ లుక్.
వాల్తేరు వీరయ్య సినిమాల్లో చిరంజీవితో పాటు రవితేజ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా, చిరంజీవికి తమ్ముడిగా రవితేజ కనిపిస్తాడు . ఇప్పుడీ పాత్రకు సంబంధించి ప్రీ లుక్ రిలీజ్ చేశారు.
ఓ చేతిలో మేక పిల్లను పట్టుకుని మరో చేతిలో గొడ్డలి పట్టుకుని సిలిండర్‌ని లాగుతున్న రవితేజ.. పవర్ ఫుల్ యాక్షన్‌కు సిద్ధమైనట్లు కనిపించారు. “మాస్ ఈజ్ కమింగ్” అని పోస్టర్ పై రాసుంది. రవితేజ ఫస్ట్ లుక్ డిసెంబర్ 12వ తేదీ ఉదయం 11:07 గంటలకు విడుదల కానుంది.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రస్తుతం యూరప్ లో లీడ్ పెయిర్‌పై పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి రానున్నాడు వాల్తేరు వీరయ్య.