మాస్ మహారాజా రవితేజ లైనప్ మామూలుగా లేదు. ఖిలాడి, ధమాకా, రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ లతో పాటు రావణాసుర సినిమా కూడా చేస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుఅభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో రవితేజ మొత్తం 10 గెటప్ లలోకనిపించబోతున్నాడట. అలాగే అక్కినేని సుశాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
కాగా సంక్రాంతి కానుక ఈ సినిమాకు సంబంధించి మరో మాస్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లుక్ లో రవితేజ నోట్లో సిగరెట్ పెట్టుకుని స్టైలిష్ గా కనిపించారు. అలాగే నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు.