మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. ఆ హిట్ ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ సినిమాలు చేస్తున్నాడు. వీటితోపాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమా కూడా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అక్కినేని సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదిలావుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాని అన్ని రియల్ లొకేషన్స్ లోనే చిత్రీకరించేలా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ మూవీ కోసం ఎలాంటి స్పెషల్ సెట్లు నిర్మించడం లేద ట. హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్, సిటీ కాలేజ్ లైబ్రరీ వంటి ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో రవితేజ 10 గెటప్ లలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.