“ధమాకా”, “వాల్తేరు వీరయ్య”తో రవితేజ రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాడు. “వాల్తేరు వీరయ్య”లో అతడిది అతిథి పాత్ర అనుకున్నారు కానీ నిజానికి అది సెకెండ్ హీరో పాత్ర.
ఇప్పుడు ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు మాస్ రాజా. ‘రావణాసురుడు’ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. కాబట్టి ఈ నటుడు చిన్న విరామం తీసుకుంటున్నాడు. వారం రోజుల పాటు హాలిడేపై విదేశాలకు వెళ్లాడు.
చాలామంది అగ్ర నటులు తరచూ సెలవులు తీసుకుంటుండగా, రవితేజ నాన్‌స్టాప్‌గా పని చేయడానికి ఇష్టపడతాడు. ఒక సినిమా కంప్లీట్ కాకముందే, మరో సినిమా స్టార్ట్ చేస్తాడు. అలా మిగతా హీరోలతో పోలిస్తే చాలా బిజీగా ఉంటాడు. మధ్యమధ్యలో ఇలా షార్ట్ గ్యాప్స్ తీసుకుంటాడు.
ఇదిలా ఉంటే తన రెండు సినిమాలు సక్సెస్ కావడంతో ఇప్పుడు 20 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట రవితేజ. గతంలో రూ.17 కోట్లు తీసుకునేవాడు.