మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. అలాగే దీంతో పాటు శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. అయితే ప్రస్తుతం ఖిలాడి సినిమాకి సంబంధించి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు రవితేజ.
ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల తర్వాత రవితేజ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. కాగా తాజా సమాచారం ప్రకారం…ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అక్టోబర్ 1 నుండి షూటింగ్ మొదలు కాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా కుటుంబ భావోద్వేగాలతో తెరకెక్కనుందని సమాచారం.