ఢిల్లీ, తొలివెలుగు: తమిళనాడు కూనూరు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన బిపిన్ రావత్ దంపతులకు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.
రావత్ కు యావత్ దేశం కన్నీటి వీడ్కోలు పలికింది. ఢిల్లీ కంటోన్మెంట్ శ్మశానవాటికలో బిపిన్ రావత్, మధులిక రావత్ లకు పార్థివదేహాలకు ప్రముఖులు,అధికారులు నివాళులు అర్పించారు.అనంతరం..కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. రావత్కు గౌరవసూచికంగా 17 శతఘ్నులను గాల్లోకి పేల్చి వందనం చేశారు.మొత్తం 800 మంది సిబ్బంది ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ పలువురు కేంద్రమంత్రులు,ప్రముఖులు హాజరైయ్యారు.విదేశీ ప్రముఖులు కూడా అంత్యక్రియలలో పాల్గొన్నారు.రావత్ దంపతుల భౌతికకాయాలపై కప్పిన త్రివర్ణపతాకాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అధికారులు అందించారు.