అతి వేగమే హీరో సాయి తేజ్ బైక్ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. 2020లో ఓసారి ఓవర్ స్పీడ్ కారణంగా పోలీసులు ఫైన్ కూడా వేశారు. టీఎస్ 07 జీజే 1258 అనే నెంబర్ తో ఉన్న బైక్ అనిల్ కుమార్ పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఈ బైక్ ఖరీదు రూ.18 లక్షలు. ఇది 1160 సీసీతో నడిచే స్పోర్ట్స్ బైక్.
ఇక రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదైంది. 336 ఐపీసీ, 184 ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు పెట్టారు. సీసీ కెమెరాలో సాయి తేజ్ ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
శుక్రవారం రాత్రి 8గంటల 5 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సీసీ పుటేజీలో కనిపిస్తోంది. బైక్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం గురించి పోలీసులకు 108 సిబ్బంది తెలియజేశారు.