లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి 1 నుండి మే 31 వరకు అంటే మూడు నెలల పాటు మీరు బ్యాంకుల ద్వారా తీసుకున్న లోన్లకు ఈ ఎమ్ ఐ లపై మారటోరియం విధించింది ఆర్బీఐ. అంటే మూడు నెలలు వాయిదా వేసింది. ఆర్థిక వెసులుబాటు ను కల్పించారు అని ప్రజలు సంతోషంగా ఫీల్ అయ్యారు. కట్ చేస్తే బ్యాంకు లు, ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేశారు. ఆర్బీఐ కూడా బ్యాంకులకు గట్టి ఆదేశాలు ఇవ్వకుండా నిర్ణయాన్ని, ఆప్షన్ల ను బ్యాంకులకు వదిలేసింది.దీంతో బ్యాంకులు , కస్టమర్లతో ఆడుకుంటున్నాయి.ప్రభుత్వం కూడా సైలెంట్ గా చోద్యం చూస్తోంది.
పేరుకే మూడు నెలల వాయిదా, ఇది కస్టమర్లకు పెను భారంగా మారింది.మూడు నెలల కట్టకపోతే కస్టమర్లకు లాభం జరిగేది రెండు విషయాల్లో మాత్రమే, ఒక్కటి లేట్ పేమెంట్ ఫీ ఉండదు, రెండోది సిబిల్ స్కోర్ లో మార్పు లేకపోవడం. ఇంతకు మించి కస్టమర్లకు ఒరిగేదేమీ ఉండదు అంటున్నారు నిపుణులు.పొరపాటున మూడు నెలల వాయిదా ఎంచుకున్నట్లైతే మిమ్మల్ని బ్యాంకులు ముంచేయడం ఖాయమంటున్నారు.
ఉదాహరణకు, 4 లక్షల పర్సనల్ లోన్ 15 శాతానికి తీసుకున్న ఒక వ్యక్తి 9516 రూపాయలు 60 నెలల పాటు కట్టాలి అనుకుందాం. ఒకవేళ ఆ వ్యక్తి మూడు నెలల వాయిదా ను ఎంచుకుంటే 67 నెలల పాటు తన ఈ ఎమ్ ఐ ను కట్టాల్సి ఉంటుంది.దాదాపు 33 వేల రూపాయలు ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ వడ్డీ చార్జీలతో కస్టమర్ ల నడ్డి విరుస్తున్నారు.ఇక క్రెడిట్ కార్డ్ లు అయితే మరింత ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది.
దీన్ని బట్టి ఈ ఎమ్ ఐ లు కట్టడమే బెటర్ అంటున్నారు నిపుణులు. ఉపయోగం లేని నిర్ణయాలు తీసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప మరొకటి కాదంటున్నారు.డబ్బులు ఉంటే ఈ ఎమ్ ఐ లు కట్టడమే బెటర్ అంటున్నారు.