బ్యాంకులను ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ హెచ్చరించారు. ఆస్తులు–అప్పుల మధ్య వ్యత్యాసం పెరుగుతూ ఉంటే జాగ్రత్త పడాలని బ్యాంకులకు ఆయన సూచించారు.
ఆస్తులు ఎక్కువైనా, అప్పులు అధికమైనా ఆర్థిక స్థిరత్వానికి ఇబ్బందికరమేనని ఆయన వెల్లడించారు. అమెరికాలోని తాజా బ్యాంకింగ్ సంక్షోభానికి ఇదే కారణమని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు.
కొచ్చిలో ఆయన ఫెడరల్ బ్యాంక్ ఫౌండర్ కేపీ హోర్మిస్ వార్షిక మెమోరియల్ ఉపన్యాసం చేశారు. ప్రస్తుతం భారత బ్యాంకింగ్ వ్యవస్థ అత్యంత స్థిరంగా, ధృడంగా వుందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతానికి ద్రవ్యోల్బణ భయాలు తగ్గినట్లేనని ఆయన తెలిపారు. మన విదేశీ రుణాలు నిర్వహించదగిన స్థాయిలో వున్నాయన్నారను. అందువల్ల మనం భయపడాల్సిన అవసరం లేదన్నారు. కాబట్టి గ్రీన్‌బ్యాక్‌ను మెచ్చుకోవడం వల్ల మనకు ఎలాంటి సమస్య ఉండదన్నారు.
వాణిజ్య బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, యూసీబీల కోసం ఏకీకృత, సమన్వయ పరిచిన పర్యవేక్షక విధానంతో కూడిన చర్యల ద్వారా ఇటీవలి సంవత్సరాల్లో ఆర్‌బఐ పర్యవేక్షక వ్యవస్థలు గణనీయంగా బలోపేతమయ్యాయని పేర్కొన్నారు.