సహకార బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కొరడా ఝుళిపించింది. ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించనందుకు 8 సహకార బ్యాంకులపై రూ. 12.75 లక్షలు జరిమానా విధించింది.
పశ్చిమబెంగాల్ లోని నబాపల్లి సహకార బ్యాంకుపై రూ. 4 లక్షలు జరిమానా విధించినట్టు ఆర్బీఐ తెలిపింది. భగత్ అర్బన్ కోపరేటివ్ బ్యాంకుపై రూ. 3 లక్షలు, మణిపూర్ మహిళ సహకార బ్యాంకుపై రూ. 2 లక్షలు జరిమానాలు విధించినట్టు వెల్లడించింది.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని కొన్ని సెక్షన్‌లను ఉల్లంఘించినందుకు యూపీలోని యునైటెడ్ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, నగీనా రూ. 1 లక్ష జరిమానా విధించినట్లు ఆర్బీఐ పేర్కొంది.
అదేవిధంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్, 2014 నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను జిల్లా సహకారి కేంద్రీయ బ్యాంక్ మర్యాడిట్ నర్సింగ్ పూర్ పై రూ. 50000 జరిమానా విధించినట్టు తెలిపింది.