.
RBI మానిటరి పాలసీ రివ్యూ వ్యాపార వర్గాలకు నిరాశే మిగిల్చింది. రెపో రేటు, రివర్స్ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆర్బీఐ ప్రకటించింది. గతంలో ఉన్న రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటును 3.3 శాతాన్ని యధాతధంగా కొనసాగించనున్నట్టు తెలిపింది. అలాగే అకామిడేటీవ్ విధానాన్ని కొనసాగిస్తామని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ప్రస్తుతం తొలి అర్థభాగంలో జీడీపీ వృద్ధి రేటు ఆశాజనకంగా ఉందని… అఇయతే 2020-21వ సంవత్సరానికి రియల్ జీడీపీ వృద్ధి రేటు నెగటివ్‌లోనే ఉంటుందని అంచనా వేసింది. ఆర్థిక గమనం నెమ్మదిగా మొదలైందని.. లాక్‌డౌన్‌ల కారణంగా మళ్లీ మందగమనం ఏర్పడుతోందని ఆర్బీఐ అభిప్రాయపడింది. కాగా ఆర్బీఐ ఈ సారి వడ్డీరేట్లను 25బేస్ పాయింట్లు తగ్గిస్తాయని వ్యాపార వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి.