నోట్ల రద్దు తర్వాత 2000నోటు రావటంతో అసలు నోటా దొంగ నోటా అన్న జాగ్రత్త మరింత పెరిగింది అనటంలో సందేహాం లేదు. ఎంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజితో కొత్త కరెన్సీ తయారు చేసినా ఈ ఫేక్ నోట్ బెడద మాత్రం తప్పటం లేదు. అందుకే ఆ సమస్య నుండి తప్పించుకునేందుకు ఆర్‌బీఐ పరిష్కారాన్ని కనిపెట్టింది. మన దగ్గర ఉన్న కరెన్సీ నోటు అసలుదా…? నకిలీదా…? కనుగొనేందుకు ఓ మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. కళ్లు లేని వారు కూడా ఆడియో ద్వారా ఏదీ అసలు నోటో ఏదీ దొంగ నోటో తెలుసుకునే వీలు కూడా కల్పించింది.
ఆర్‌బీఐ విడుదల చేసిన మనీ-మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైర్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒకసారి ఈ యాప్ డౌన్‌లోడ్ అయితే ఆ తర్వాత ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా ఆఫ్‌లైన్‌లో ఉన్నా యాప్ అద్భుతంగా పనిచేస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ తెలిపారు. ఈ యాప్ ఓపెన్ చేసి… మన ఫోన్ కెమెరా ముందు కరెన్సీ నోట్ ఉంచితే చాలు. ఆ యాప్ అటోమెటిక్‌గా స్కాన్ చేసి మన నోటు ఎంత విలువైందో చెప్పేస్తుంది. ఇంగ్లీషుతో పాటు హిందీలోనూ ఆ నోటు ఎంతదో యాప్ చెబుతుంది. ఒకవేళ యాప్ ఆ నోటు విలువ చెప్పలేకపోతే… ఆ నోటు నకిలీది అని అర్థం. ఈ యాప్ అంధులకు అద్భుతంగా పనికొస్తుందని ఆర్బీఐ వర్గాలంటున్నాయి.