రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 926 పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏదైనా డిగ్రీలో 50% మార్కులతో పాటు, కంప్యూటర్‌లో వర్డ్ ప్రాసెసింగ్ తెలిసి ఉన్నవారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తు చేసేందుకు ఈ నెల 16 ఆఖరి తేదీగా అధికారులు ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ కార్యాలయంలో కూడా ఖాళీలున్నాయని పేర్కొన్నారు.
ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలివే..
అహ్మదాబాద్- 19
బెంగళూరు- 21
భోపాల్- 42
భువనేశ్వర్- 28
చండీగఢ్- 35
చెన్నై- 67
గువాహతి-55
హైదరాబాద్- 25
జైపూర్- 37
జమ్మూ- 13
కాన్పూర్ అండ్ లక్నో- 63
కోల్‌కతా- 11
ముంబై- 419
నాగ్‌పూర్- 13
న్యూఢిల్లీ- 34
పాట్నా- 24
తిరువనంతపురం అండ్ కొచ్చి- 20
ఆసక్తిగల అభ్యర్థులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ www.rbi.org.in ఓపెన్ చేసి మరిన్ని వివరాలు చూడొచ్చు.