రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రేడ్-బి పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. నవంబర్ 9న నిర్వహించిన ప్రిలిమ్స్ ఫేజ్-1 పరీక్ష ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ప్రకటించింది.
పోస్టుల వారీగా జరిగిన రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను విడివిడిగా విడుదల చేసింది ఆర్బీఐ. ఫేజ్-1కు అర్హత సాధించిన అభ్యర్ధులు ఫేజ్-2 పరీక్షకు రాయాల్సి ఉంటుంది. డిసెంబర్-2న దేశవ్యాప్తంగా ఫేజ్2 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
గ్రేడ్-2 పోస్టులకు నిర్వహిస్తున్న ఈ పరీక్షల్లో మొత్తం 199ఖాళీలున్నాయి.