దేశంలో త్వరలోనే డిజిటల్ రూపాయిని ఆర్బీఐ లాంచ్ చేయనుంది. ప్రయోగాత్మకంగా దేశంలో త్వరలోనే డిజిటల్ కరెన్సీని ప్రారంభిస్తామని ఆర్బీఐ పేర్కొంది.
ఈ మేరకు దీనికి సంబంధించిన కాన్సెప్ట్ నోట్ను ఆర్బీఐ విడుదల చేసింది. ఇందులో సీబీడీసీ సాంకేతికత తో పాటు భవిష్యత్తులో దీని ఉపయోగాలు, జారీ విధానం, డిజైన్ ప్రత్యామ్నాయాలు వంటివి అంశాలు ఉన్నాయి.
కొన్ని నిర్ధిష్టమైన సందర్బాల్లో ఉపయోగం కోసం డిజిటల్ రూపీని ప్రయోగాత్మకంగా ప్రారంభించబోతున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.
ప్రస్తుతం చలామణిలో ఉన్న చట్టబద్ధమైన కరెన్సీకి ఈ-రూపీ కేవలం అదనపు వెసులుబాటు మాత్రమేనని నోట్ లో ఆర్బీఐ పేర్కొంది.
బ్యాంకు నోట్లతో పోల్చినప్పుడు ఇది ఏ మాత్రం విభిన్నమైనది కాదని పేర్కొంది. కేవలం డిజిటల్ రూపంలో ఉండడం మాత్రమే దీని ప్రత్యేకతగా పేర్కొంది.
ఈ డిజిటల్ రూపీ వల్ల మరింత సులభంగా, వేగంగా తక్కువ ఖర్చుతో లావాదేవీలు పూర్తవుతాయని పేర్కొంది. ఈ కరెన్సీ గురించి ఇటీవల బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ్ ప్రకటించారు.