ఒక్కోసారి డబ్బులు అవసరమై ఏటీఎంకు వెళ్తే నో క్యాష్ బోర్డులు కనబడుతుంటాయి. బాగా చిరాగ్గా అనిపిస్తుంది. ఈమధ్య కాలంలో ఇలాంటి ఎక్కువయ్యాయి. దీంతో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎంలలో నగదు అందుబాటులో లేని సమయం… నెలకు 10 గంటలు దాటితే ఒక్కో ఏటీఎంకు రూ.10వేల జరిమానా విధిస్తామని ప్రకటించింది.
అక్టోబరు 1 నుంచి ఈ తాజా నిబంధన అమల్లోకి రానుంది. అంటే.. ఇకపై ఏటీఎంలో క్యాష్ ఖాళీ అయిన వెంటనే బ్యాంకులు తిరిగి నింపాల్సిందే. లేకపోతే జరిమానా తప్పదు.
ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఆర్బీఐ. ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉండేలా బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తమ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని సూచించింది.