సులభతరంగా లోన్స్ ఇస్తామంటూ ఆశ చూపి, అధిక వడ్డీలు వసూలు చేస్తూ… వేధింపులకు దిగుతున్న ఆన్ లైన్ లోన్ యాప్స్ పై ఆర్బీఐ సీరియస్ అయ్యింది. ఎవరు పడితే వారు లోన్స్ ఇచ్చేందుకు అనుమతులు లేవని, చట్టబద్ధంగా లోన్స్ ఇచ్చే సంస్థలు ఆర్బీఐ అనుమతితో ఇస్తాయని స్పష్టం చేసింది.
చట్టవ్యతిరేకంగా ఫైనాన్స్ చేస్తున్న యాప్స్, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూనే ప్రజలకు ఆర్బీఐ కీలక సూచనలు చేసింది. ప్రజలెవరూ తమ కే.వై.సీ డాక్యుమెంట్లను కానీ, తమ అకౌంట్ డిటైల్స్ కానీ ఎవరికీ ఇవ్వకూడదని స్పష్టం చేసింది. చట్టవ్యతిరేకంగా ఫైనాన్స్ చేస్తున్న సంస్థలపై ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.
ఇక రుణాలిచ్చే సంస్థలకు ఆర్బీఐ గుర్తింపు ఉందో లేదో ఆర్బీఐ వెబ్ సైట్ లో చూసుకోవచ్చని, బ్యాకింగ్-నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ సంస్థలు కూడా తమ బ్యాంకుల వివరాలను అందరికీ తెలిసేలా పొందుపర్చాలని ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ యోగేష్ దయల్ స్పష్టం చేశారు.