ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద ఇద్దరు పెద్ద హీరోలు తమ చిత్రాలతో ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడ్డారు. రెండు సినిమాలు కలెక్షన్లలో నువ్వా- నేనా అన్నట్లు టఫ్ ఫైట్ ఇచ్చాయి. అయితే తాజాగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర మెగా ఫైట్ జరగబోతుందంట…
గడిచిన ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఆర్‌ఆర్‌ఆర్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పుష్ప చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేర్లు పాన్ ఇండియా లెవల్లో మోత మోగిపోయాయి. ప్రస్తుతం వీరిద్దరి క్రేజ్ వేరే లెవల్‌లో ఉంది. ముఖ్యంగా బన్నీ అయితే మెగా ఫ్యామిలీ నీడలో నుంచి బయటకు వచ్చి పాన్ ఇండియా హిట్ కొట్టడంతో అల్లు ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.
మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్.. అంతర్జాతీయ స్థాయిలో దుమ్ముదులిపాడు. దీంతో అల్లు X మెగా ఫ్యాన్స్ ఢీ అంటే ఢీ అంటున్నారు. తాజాగా వచ్చే సంక్రాంతిలో బన్నీ, చెర్రీ బాక్సాఫీస్ దగ్గర ఫైట్ చేస్తారని టాక్ నడుస్తోంది. RC15 సినిమా.. పుష్ప- 2తో 2024 సంక్రాంతి బరిలో దిగుతుందని తెలుస్తోంది. మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ బాక్సాఫీస్ బరిలో దిగుతున్నట్లు ఫ్యాన్స్ చెబుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో క్రేజీ పోస్ట్‌లు నడుస్తున్నాయి.
మెగా ఫ్యామిలీ వేరే హీరోలపై పోటీ పడ్డారు కానీ.. ఇలా వాళ్లలో వాళ్లే ఫైట్ చేయడం ఎప్పుడూ జరగలేదు. అందుకే ఈ క్రేజీ న్యూస్‌పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ‘RC-15’ సినిమా కొంతకాలంగా నిర్మాణ దశలో ఉంది. మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప- 2 షూటింగ్ ఇప్పుడే ప్రారంభమైంది. ఈ రెండూ పాన్ ఇండియా సినిమాలే. సో.. రెండు సినిమాలు నిజంగానే సంక్రాంతి బరిలో ఉంటే.. మెగా ఫ్యాన్స్‌కు డబుల్ పూనకాలు పక్కా.