రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తపు కార్యక్రమం కూడా జరిగింది. అయితే ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా…సునీల్ ,అంజలి , నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సాయి మాధవ్ బుర్ర మాటలు రాస్తున్నారు. ఇక ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. అయితే తాజా సమచారం మేరకు ఈ సినిమా బడ్జెట్ కు సంబంధించి ఓ విషయంలో దిల్ రాజు శంకర్ మధ్య చిన్న విషమై ఓ చర్చ జరుగుతుందట.
అదేంటంటే…ఈ సినిమాకి గాను శంకర్ మొత్తం 200 కోట్లు బడ్జెట్ ను ప్లాన్ చేస్తుండగా…దిల్ రాజు మాత్రం 170 కోట్లు అంటున్నారట. దిల్ రాజు తన బ్యానర్ లో 50 వ చిత్రంగా ఈ సినిమాను తెరకక్కిస్తున్నారు. ఇక శంకర్ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ ఉంటాయి. అదే విధంగా దీనిని కూడా ప్లాన్ చేస్తున్నారు శంకర్. మరి దిల్ రాజు అందుకు ఒప్పుకుంటాడో లేదో చూడాలి.