సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్ లో 15వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ చూస్తే రోబో సినిమా ఎవరికైనా గుర్తొస్తుంది. కియారా అద్వానీ, మ్యూజిక్ డైరెక్టర్, తమన్ ,శంకర్ , రామ్ చరణ్ అంతా కూడా డిఫరెంట్ గా కనిపిస్తూ ఉన్నారు. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుందో చెప్పటానికి ఈ పోస్టర్ చాలు. ఇక ఈ సినిమాకు సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్న సంగతి తెలిసిందే.