మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా మార్చి 25న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో RC 15 సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ ను తూర్పుగోదావరి జిల్లాలో ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి అనుమతి కూడా కోరారట. ఫిబ్రవరి 10 నుండి తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలలో షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న దోసకాయల పల్లి గ్రామానికి డైరెక్టర్ శంకర్ తో పాటు టీం సభ్యులు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు మొన్న జనవరి 31న ఏలూరు రేంజ్ డీఐజీ కి మేకర్స్ లేఖ కూడా రాశారు రాజమండ్రి కాకినాడ కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సినిమా షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నాడట శంకర్.