శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఆర్సీ 15 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ పవర్ ఫుల్ ఐఎఎస్ ఆఫీసర్ గాకనిపించనున్నాడు. అలాగే కియారా అద్వానీ రామ్ చరణ్ సరసన నటిస్తోంది.
అంజలి, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయింది. రెండవ షెడ్యూల్ షూటింగ్ ఏపీ లోని కొన్ని ప్రాంతాలలో షూట్ చేయనున్నారు. అందుకు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని సెట్స్ ను కూడా వేశారట.
ఈ సెట్స్ లోనే రామ్ చరణ్ పై ఫైటింగ్ సీన్స్ షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఆతర్వాత అమృత్ సర్ లో షూటింగ్ చేయనున్నారట. రాజకీయ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు కు ఇది 50వ చిత్రం కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు 15వ చిత్రం. ఇక రామ్ చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్, ఆచార్య సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.